ఫ్యాన్స్ కి మెగాస్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటో తెలుసా….??

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో మెగాస్టార్, తన అత్యద్భుత నటనతో ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు. అయితే కమర్షియల్ గా మాత్రం ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో, తదుపరి చేయబోయే 152వ సినిమా విషయమై మెగాస్టార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

 

సక్సెస్ఫుల్  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. మెగాస్టార్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ ఇప్పటికే తన బాడీని చాలావరకు తగ్గించుకుని మంచి లుక్ లోకి మారారు. మెసేజ్ ఓరియెంటెడ్ కథగా, పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర హైలైట్ అని, తప్పకుండా తన గత సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా హిట్ కొట్టేలా కొరటాల ఎంతో పవర్ఫుల్ గా కథను సిద్ధం చేసుకున్నాడట.

ఇకపోతే ఈ సినిమా కోసం మూడు రోజుల క్రితం సినిమా యూనిట్ మెగాస్టార్ పై ఒక ప్రత్యేక ఫోటోషూట్ ని నిర్వహించిందని, సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేయనున్నారని నేడు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ సినిమా లో నటించబోయే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ఆరోజే వెల్లడించనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, నిజంగా ఇది మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూ ఇయర్ సర్ప్రైజ్ అనే చెప్పాలి…!!

Read more RELATED
Recommended to you

Latest news