టీచర్‌‌గా మంత్రి హరీశ్‌రావు.. మాస్టార్ పేరు కూడా రాయలేకపోయిన విద్యార్థులు.. వీడియో

-

తెలంగాణ… సంగారెడ్డి జిల్లా‌ కందిలోని జిల్లా పరిషత్ స్కూల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మంత్రి పరిశీలించారు. తర్వాత పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. అయితే మంత్రి హరీశ్ రావు కొద్దిసేపు టీచర్‌గా మారారు. ఈ నేప‌థ్యంలోనే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు మంత్రి వేశారు. వాటికి స్టూడెంట్స్ చెప్పిన సమాధానాల్ని ఆసక్తిగా విన్నారు. అయితే మంత్రి ప్రశ్నలకు అక్కడి విద్యార్ధులు కనీసం సమాధానాలు చెప్పలేకపోయారు. తెలుగులో కూడా పేర్లు రాయలేకపోయారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులపై మంత్రి హరీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే పరీక్షల్లో ఎలా పాసవుతారని హరీష్‌ ప్రశ్నించారు.

పదో తరగతికి వచ్చినా కనీసం ఎక్కాలు చెప్పడం రాకపోతే ప్రపంచంతో ఎలా పోటీపడతారని మండిపడ్డారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై ఆరాతీశారు. వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యకు ప్రభుత్వం అన్న రకాలుగా అండగా ఉంటుందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news