చరణ్ విషయంలో చిరంజీవి అసంతృప్తి..!

-

మెగాస్టార్ చిరంజీవి తన వారసుడు రాం చరణ్ ను చూసి అసంతృప్తి చెందుతున్నాడని తెలుస్తుంది. అదేంటి మెగా తనయుడిగా ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాస్తున్నాడు కదా మరి అలాంటిది చరణ్ కోసం చిరంజీవి ఎందుకు ఈ అసంతృప్తి అంటే చరణ్ చేస్తున్న పనుల వల్ల చిరు కొద్దిగా డిస్ట్రబ్ అవుతున్నాడట. రీసెంట్ గా రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.

డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా 100 కోట్ల గ్రాస్ 60 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అయితే 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వివి ఆర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు రిటర్న్ గా కొంత ఎమౌంట్ అడ్జెస్ట్ చేశాడు రాం చరణ్. నిర్మాత కోరిక మేరకు 5 కోట్లు రిటర్న్ ఇచ్చాడు. ఈ విషయంలోనే బోయపాటి శ్రీను తో నిర్మాత డివివి దానయ్య గొడవ పడ్డాడు. అయితే ఈ సెటిల్ మెంట్ వ్యవహారం తెలిసి మెగాస్టార్ చిరంజీవి చరణ్ ను మందలించాడని తెలుస్తుంది. భారీ లాసులు వస్తే తప్ప ఇలా రిటర్న్ ఇవ్వొద్దని.. వారికి లాభాలు వచ్చినప్పుడు నిర్మాతలకు రిటర్న్ ఇవ్వరని కాస్త బ్రైన్ వాష్ చేశాడట. నిర్మాత కష్టం తెలిసిన చరణ్ తన వంతుగా సపోర్ట్ గా ఉండాలనుకున్నాడు.

అయితే వివి ఆర్ టోటల్ గా 30 కోట్లు లాస్ తెచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కు 3 నుండి 5 కోట్లు లాస్ అన్నమాట. మిగతా సీమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని.. అందుకే ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దని చరణ్ కు చెప్పాడట చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news