లక్ష్మీస్ ఎన్టీఆర్… ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో..?

-

RGV trailer gets huge amount response

లక్ష్మీస్ ఎన్టీఆర్… అంటే లక్ష్మీపార్వతి వైపు నుంచి చూస్తే… లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ కలిసి ఉన్న సమయంలో జరిగిన వాటిని… ఉన్నవి ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టు సినిమాగా తీస్తున్నాడు ఆర్జీవీ. ఎప్పుడైతే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేశాడో.. అది కూడా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా తీయడం సహించక ఉన్నది ఉన్నట్టుగా వస్తున్నదే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆర్టీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. కానీ ట్రైలర్ మాత్రం బీభత్సంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ అనే సరికి హే.. ఈయన సినిమా ఏం తీస్తాడు.. ఇది వరకు ఆర్జీవీ తీసిన సినిమాలు ఉన్నట్టే ఇది కూడా ఉంటుంది అని అనుకున్నారు కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్.. అలా కాదు పాత వర్మను మళ్లీ చూసే అవకాశం లభించింది లక్ష్మీస్ ఎన్టీఆర్ తో. చంద్రబాబును మాత్రం ఆర్జీవీ ఓ ఆట ఆడుకున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత  కూడా తన ట్విట్టర్లో రెచ్చిపోయాడు ఆర్జీవీ. ప్రపంచంలోని నేతలంతా ఆర్టీవి.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తున్నట్టుగా ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం అవే వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news