RC15 : శంకర్, చరణ్ పాన్ ఇండియా మూవీ లాంచ్.. `విశ్వంభర` టైటిల్‌ ఫిక్స్‌ !

మెగా పవర్‌ స్టార్‌ రాం చరణ్‌ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబి నేషన్‌ లో భారీ బడ్జెట్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసందే. ఈ సినిమా రాం చరణ్‌ కెరీర్‌ లో 15 వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ తమన్‌ సంగీతాన్ని అందిస్తుండగా… దిల్‌ రాజ్‌ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అయితే… తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ ను ఫైనలైజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు ఈ క్రేజీ ప్రాజెక్టుకు ”విశ్వంభర” అనే టైటిల్‌ ను ఫైనలైజ్‌ చేశారని టాక్‌. డా. సి. నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్‌ అవార్డు తెచ్చి పెట్టిన కవితా సంకలనం పేరు కూడా ”విశ్వంభర”. దీంతో ఆ టైటిల్‌ పై సాహిత్యా భిమానుల దృష్టి కూడా పడింది.

ఇక ఈ సినిమా బుధవారం రోజున హైదరాబాద్‌ లో లాంఛనంగా ప్రారంభించేశారు. శంకర్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే టెస్ట్‌ షూట్స్‌ మొదలైనట్లు గా కూడా కొన్ని సోషల్‌ మీడియాలో దర్శనిమించాయి. ఇక ”విశ్వంభర” టైటిల్‌ ను ఇవాళ జరుగుతున్న పూజ కార్యక్రమాల అనంతరం నిర్మాతలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇక సినిమా ప్రారంభోత్సవానికి రణవీర్ సింగ్, రాజమౌళి, చిరంజీవి కూడా హాజరు అయ్యారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్‌ వచ్చింది.