హాస్యబ్రహ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

-

వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ తారలు, బ్రహ్మానందం అభిమానులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా హాస్యబ్రహ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

” నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలలో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఒక గొప్ప హాస్యనటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీ కి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు.. అతని మొహం చూస్తేనే హాస్యం వెళ్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది.

ఇలాంటి బ్రహ్మానందానికి హృదయపూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మానందం కి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు ” అంటూ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news