Throwback ఫొటోతో పవర్ స్టార్​కు మెగాస్టార్ చిరు బర్త్ డే విషెస్

-

ఇవాళ పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. నేటితో ఆయన 52వ పడిలోకి అడుగుపెట్టాడు. పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం పవన్ ఫొటోలు, వీడియోలతో హోరెత్తిపోతోంది. #HBDPOWERSTAR, #JANASENANI వంటి హ్యాష్ ట్యాగ్​లు ట్రెండింగ్​లోకి వచ్చాయి.

ఇక తాజాగా పవర్ స్టార్​కు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్​తో కలిసి దిగిన throwback ఫొటోను జత చేసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు చిరంజీవి. “ప్రియమైన కళ్యాణ్ బాబు.. జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్‌ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news