టిడిపి అధినేత నారా చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చి 48 గంటలు గడిచినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం ఆయన తాడేపల్లి లోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియా పూర్తిస్థాయిలో వార్తలు రాసిందని, వాటిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 2020లో ఒకసారి, 2021 లో ఇంకోసారి ఐటీ దాడులు జరిగాయని.. మనోజ్ దేవ్, శ్రీనివాస్ ఇళ్లలో ఐటీ తనిఖీలు చేసిందన్నారు.
ఎల్ అండ్ టి, షాపూర్జి పల్లంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి అక్కడి నుండి చంద్రబాబుకు నిధులు అందాయని ఐటి చెప్పిందన్నారు. వీటిపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఐటీ అడిగిన లంచాల వ్యవహారం గురించి మాట్లాడకుండా సాంకేతిక అంశాల గురించి సమాధానం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకాలం నుండి చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగుతూ వచ్చిందన్నారు సజ్జల.