‘హరిహర వీరమల్లు’ నుండి తప్పుకున్న సంగీత దర్శకుడు కీరవాణి..? పవన్ ఫాన్స్ కి ఇది మాములు షాక్ కాదు

-

వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..కెరీర్ లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జానర్ లో సినిమా చేస్తుండడంతో ఆయన అభిమానులు మాత్రమే కాదు..ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని నిర్మించిన AM రత్నం గారు ఈ సినిమాని కూడా సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు..హాలీవుడ్ కి చెందిన ఎంతో మంది టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే గత కొంతకాలం నుండి ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వాళ్ళ తాత్కాలికంగా ఆగిపోవడం తో ఇండస్ట్రీ లో ఎన్నో గాసిప్స్ గుప్పుమన్నాయి..’హరిహరవీరమల్లు’ మధ్యలోనే ఆగిపోయిందని..పవన్ కళ్యాణ్ కి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ సరిగా నచ్చకపోవడం తో డైరెక్టర్ క్రిష్ కి కొన్ని కీలక మార్పులు సూచించాడని..ఆ మార్పులు చెయ్యడానికే ఎక్కువ సమయం పడుతుందని ఇలా ఎన్నో వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి..అయితే ఇటీవల చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ బ్యాంకు లో కేక్ కటింగ్ కి హాజరైన AM రత్నం గారు హరిహర వీరమల్లు సినిమా గురించి అక్కడకి వచ్చిన మీడియా ని అడగగా దానికి ఆయన సమాధానం చెప్తూ ‘చాలా మంది హరిహరవీరమల్లు సినిమా ఆగిపోయింది అని అంటూ ఉండడం నేను గమనించాను..కానీ అలాంటిది ఏమి లేదు..ఇది భారీ బడ్జెట్ పీరియడ్ సినిమా..పాన్ ఇండియన్ లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము..ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ వేస్తున్నాము..దానికి చాలా సమయం పడుతుంది..అందుకే షూటింగ్ ని తాత్కాలికంగా ఆపాము..ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల చెయ్యబోతున్నాము..పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ లాగ నిలిచిపోతుంది’ అంటూ ఆయన చెప్పడం తో ఈ రూమర్స్ అన్నిటికి బ్రేక్ పడింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త అభిమానులను కంగారు పెట్టేస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణి పని చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవల ఈయన సంగీతం అందించిన #RRR మరియు భింబిసారా చిత్రాలు ఎంత పెద్ద సంచలన విజయాలు సాధించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఈ రెండు సినిమాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఆయువుపట్టులాగ నిలిచింది..అలా అద్భుతమైన ఫామ్ లో ఉన్న కీరవాణి గారు ఈ సినిమా నుండి ఇప్పుడు తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఎందుకు ఈయన సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది అనే విషయానికి కారణాలు తెలియాల్సి ఉంది..అయితే ఈ వార్తలో ఎంత మాత్రం నిజం ఉందొ స్పష్టంగా తెలియాలంటే వచ్చే నెల 2 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే..ఎందుకంటే ఆరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు..టీజర్ లేదా గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉంది..ఇవి రావాలంటే కచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ఇప్పటి నుండే ప్రారంభం అయ్యి ఉండాలి..అలా పుట్టినరోజు నాడు టీజర్ వస్తే ఇప్పుడు వచ్చిన వార్త గాసిప్ అని..లేకపోతే ఆ వార్త నిజమేనని అభిమానులు డిసైడ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news