బిజెపి అంటే టిఆర్ఎస్ కి ఎంత భయం పట్టుకుందో ఈ పరిణామాలు చూస్తే చాలు – విజయశాంతి

-

కెసిఆర్ సర్కారుపై మరోసారి నిప్పులు చేరిగారు బిజెపి నాయకురాలు విజయశాంతి. బిజెపి అంటే టిఆర్ఎస్ కి ఎంత భయం పట్టుకుందో ఈ పరిణామాలు చూస్తే చాలు అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా మండిపడ్డారు. ” తెలంగాణ పాలక పార్టీలో బీజేపీని చూస్తే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ప్రశ్నిస్తున్న కాషాయదళం ఉనికిని తట్టుకోలేక రెండు రోజులుగా బీజేపీ కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేయించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.

తప్పు చేసినవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని పదే పదే చెప్పుకునే కేసీఆర్ గారు… తన బిడ్డ విషయంలో మౌనం వహించడాన్ని బీజేపీ ప్రశ్నించడం ఆయనకు మింగుడు పడలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసిన బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టడమే గాకుండా…. ఆ విషయమై నిలదీసినందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని, వీడియో పేరిట ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని కూడా అరెస్ట్ చేయించారు.

రాష్ట్రంలో నిరసన అంటే చాలు ఉక్కుపాదం మోపి అణిచేందుకు ప్రయత్నిస్తోంది కేసీఆర్ సర్కారు. బీజేపీ అంటే టీఆరెస్‌కి ఎంత భయం పట్టుకుందో ఈ పరిణామాలు చూస్తే చాలు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రజాసమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే వేదిక ధర్నా చౌక్‌నే మూయించిన ఈ సర్కారు నుంచి ఇంతకంటే ఆశించడానికేముంది?”. అని అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news