మనవాళ్లకు దేన్నైనా సరే కామెడీ చేసేయడం అలవాటు. ఓ పక్కన ఉపద్రవం ముంచుకొస్తున్నా దానిపైనా మీమ్స్, ఫన్నీ వీడియోస్ చేసి వదిలేస్తారు. ప్రస్తుతం కరోనా అందర్నీ భయపెట్టిస్తుంటే దానిపైనా లెక్కలేనన్ని జోకులు వేస్తున్నారు. దానికి తగ్గట్టు ఉన్నత పదవుల్లో ఉన్నవారే ప్యారసెట్‌మాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ మరింత కామెడీ చేసేశారు.
ఇక ఈ మాటలను, మోహన్ బాబు పెదరాయుడు సీన్స్‌ను మిక్స్ చేసి నవ్వులు పూయించాడో నెటిజన్. ‘భారతి.. కరోనా నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. మన ముఖ్యమంత్రులు ఏం చెప్పారో తెలుసా..? మస్ట్ యూజ్ ప్యారసెట్మాల్, అండ్ స్ప్రే బ్లీచింగ్ పౌడర్ అవర్ లొకేషన్స్ ఇలా చేస్తే మనం దాన్ని అరికట్టవచ్చు.. ఈ మధ్యే ఫేస్బుక్‌లో చూశాను.. ఈ వార్త నువ్ చూశావో లేదో అని చెప్పాను.. గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టూ ఇకా బాగా అర్థమైతే షేర్ చెయ్’ అంటూ డబ్బింగ్ చేసి వీడియోను విడుదల చేశాడు.
This video is epic …. 🙂 great job by the dubbing artist 🙂 #coronavirusindia #coronovarius https://t.co/BK8000T2za
— MM*??❤️ (@HeroManoj1) March 20, 2020
ఇక ఈ వీడియోను చూసిన మంచు లక్ష్మీ పగలబడినవ్వినట్టు ఎమోజీలను పెట్టింది. ఈ వీడియో ఒక అద్భుతం.. డబ్బింగ్ ఆర్టిస్ట్ పనితనం గొప్పది అంటూ మనోజ్ పొగిడేశాడు. మంచు ఫ్యామిలీ ఎంతో స్పోర్టీవ్‌గా ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ. గతంలోనూ ఇలానే ఫసక్ అంటూ ఫేమస్ అయిన మోహన్ బాబు డైలాగ్, నిలదిస్‌ఫై అంటూ మంచు లక్ష్మీ నోరు జారిన పదాలను కూడా వారు తిరిగి ఉపయోగించి ఫన్ క్రియేట్ చేశారు.