మోహన్ లాల్ 1000 కోట్ల సినిమా ఆగిపోయింది..!

-

మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రందమూలం సినిమా ప్లాన్ చేశారు. మహాభారత కథను భీముడి కోణంలో చెప్పేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన రందమూలం నవల ఆధారంగా ఈ సినిమాను 1000 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నారు. యూ.ఏ.ఈకి చెందిన బిజినెస్ మ్యాన్ బి.ఆర్ శెట్టి ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు.

అయితే ఇప్పుడు నిర్మాత ఆ సినిమా ఆపేసినట్టు స్వయంగా వెళ్లడించారు. శ్రీకుమార్ మీనన్ డైరక్షన్ లో అనుకున్న ఈ సినిమా దర్శకుడికి నిర్మాతకు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల సినిమా ఆపేశామని ప్రకటించారు. అయితే సినిమా ఆగిపోడానికి అసలు కారణం అది కాదని అంటున్నారు. నవలా రచయిత వాసుదేవన్ నాలుగేళ్ల క్రిదట ఈ సినిమా కోసం నవల ఇచ్చారట. అప్పటికి 3 ఏళ్లు అవుతుండగా తన కథ వెనక్కి ఇచ్చేయమని అడిగాడట. అయితే అప్పుడే సినిమా ఎనౌన్స్ చేసి హడావిడి చేశారు. అయితే కేవలం ఎనౌన్స్ మాత్రమే చేసి ఆపేయడంతో ఇప్పుడు కథను తను వెనక్కి తీసుకుని అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడట. అందుకే ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు చెబుతున్నారు. దర్శకుడు దొరికితే ఇప్పటికి ఆ సినిమా నిర్మించేందుకు సిద్ధమే అని అంటున్నారు నిర్మాత బి.ఆర్ శెట్టి.

Read more RELATED
Recommended to you

Latest news