సింహరాశి | ఉగాది పంచాంగం | శ్రీ వికారినామ సంవ‌త్స‌రం 2019 రాశి ఫ‌లాలు

-

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం సింహరాశి రాశిఫ‌లాలు

మఖ-1,2,3,4 పాదాలు పుబ్బ-1, 2,3,4 పాదాలు
ఉత్తర – 1వ పాదం
ఆదాయం-8 వ్యయం-14
రాజపూజ్యం-1 అవమానం-5
ఈరాశివారి ప్రధాన గ్రహసంచారం చూస్తే.. గురువు పంచమంలో, చతుర్థంలో సంచరిస్తాడు. పంచమంలో ఉన్న సమయంలో శుభకార్య నిర్వహణ. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శని పంచంలో, షష్టమంలో సంచరిస్తాడు. దీనివల్ల ఆలోచనలు నెమ్మదిగా ఉంటాయి. వ్యాధి భయం. షష్టమంలో సంచరించిన సమయంలో పనులు పూర్తి, మంచిగా ఉంటుంది. రాహు లాభస్థానంలో, కేతువు పంచమంలో సంచరిస్తారు. ధనం వస్తుంది. అభివృద్ధి ఉంటుంది. ఈ రాశివారు సూర్యారాధన, సూర్యనమస్కారాలు చేయడం మంచిది.

Ugadi panchangam 2019 Singh rashi rashi Phalalu
Ugadi panchangam 2019 Singh rashi rashi Phalalu

ఈ రాశివారి గ్రహాల సంచారాన్ని పరిశీలించగా… రాజయోగం ఉన్నది. కార్యాలు జయప్రదంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ. శత్రువిజయం, చేసే పనిలో అందరి మన్ననలు పొందుతారు. స్థిరాస్థి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. దైవం మీద భారం వేసి పట్టుదలతో చదివితే విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ వారికి విశేష లాభాలు కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. కంప్యూటర్ రంగం వారికి శుభప్రదం. ఇంజినీర్లు, లాయర్లు, డాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు రాజకీయ రంగ ప్రవేశంతో ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది.

చైత్ర మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శ్రద్ధ, నిబద్ధతతో పనులు చేసినట్లయితే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో సంతృప్తిగా వుంటారు. వ్యాపారస్తులకు మధ్యమంగా ఉంటుంది. వైశాఖ మాసంలో విద్యార్థులు శ్రద్ధాసక్తు-లతో చదివితే సత్ఫలితాలను పొందుతారు. సమా-జంలో మంచిపేరు ఉండడంతో చిన్న చిన్న పనులు సునాయసంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యప-రంగా బాగా వుంటుంది. జ్యేష్టమాసంలో రావలసిన డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఇంటికి కొత్త వ్యక్తుల రాక. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు వుంటాయి. ఆషాఢ మాసంలో ప్రణాళికాబద్ధంగా పనులు చేయ-డంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. కొంతవరకు మానసిక, శారీరక ఇబ్బందులు వుంటాయి. అయినా సత్ఫలితాలను పొందుతారు. శ్రావణమాసంలో వ్యాపారస్తులు కొత్త వ్యాపారములు ప్రారంభించ-కుండా వుంటే మంచిది. రాజకీయ, కోర్టు వ్యవహార-ములందు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఆదా-యము మధ్యమంగా ఉంటుంది. దేవతా, గురుభక్తి పెంచుకోవడం మంచిది. భాద్రపద మాసంలో విద్యా-ర్థులు చదువు, పోటీ పరీక్షలలో నిబద్ధతతో ముందుకు వెళితే అనుకున్నవి సాధించ గలుగుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు శ్రద్ధతో ముందుకు వెళ్లాలి.

అన్నదమ్ములు, బంధువుల సహకారం వుంటుంది. డబ్బు విషయంలో నమ్మకద్రోహం కలిగే అవకాశాలు వున్నాయి. కనుక జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆశ్వియుజ మాసంలో ఆదాయ పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో భార్యా పిల్లలతో సామరస్యంగా వుంటారు. బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములతో పనులు నెరవేరుతాయి. చురుకుగా పనులు చేయడంతో సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు వుంటాయి. పెట్టుబడులకు అనుకూల సమయం. కార్తీక మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరింప బడతాయి. ఆదాయం పెరుగుతుంది. మార్గశిరంలో స్వయంవృత్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగములలో ఉన్న వారు ఆఫీ-సులో అధికశ్రమకు లోనవుతారు. ఫలితము అంతంత మాత్రంగానే వుంటుంది. వ్యాపారస్తులు అనవసర-మెన వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మానసిక ఆందోళనకు గురవుతారు. పౌష్య మాసంలో మిశ్రమ ఫలితాలు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చుట. మాఘ మాసంలో మొదటి రెండు వారములు సామాన్యంగా వుంటాయి. చివరి రెండు వారాలు కొంత పురోభివృద్ధి వుంటుంది. ఫాల్గుణ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా వుంది. అన్ని విషయాలలో అనుకూల ఫలితాలు వుంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మంచి ఫలితాలు ఉంటాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు.

– కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
మేషం
వృషభం
వృషభం
మిథునరాశి
మిథునరాశి
కర్కాటకం
కర్కాటకం
సింహం
సింహం
కన్య
కన్య
తుల
తుల
వృశ్చికం
వృశ్చికం
ధనుస్సు
ధనుస్సు
మకరం
మకరం
మీన‌రాశి
మీన‌రాశి
కుంభరాశి
కుంభరాశి

Read more RELATED
Recommended to you

Latest news