సంజ‌య్‌ద‌త్‌తో మోహ‌న్‌లాల్ దీపావ‌ళి పార్టీ!

-

లాక్‌డౌన్ కార‌ణంగా ఫిల్మ్ సెల‌బ్రిటీలు గ‌త ఏడు నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. బ‌య‌టికి రావ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు. అయితే తాజాగా లాక్‌డౌప్ నింధ‌న‌ల్ని స‌డ‌లించ‌డంతో న‌చ్చిన చోటికి వెళ్ల‌డం మొద‌లుపెట్టారు. కొంత మంది విహార యాత్రకు వెళుతుంటే కొంత మంది మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది స్టార్స్ న‌చ్చిన వారి ఇంటికి వెళ్లి స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు.

 

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ళాప‌స్వీ కె. విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ ఫ్యామిలీతో క‌లిసి దీపావ‌ళి వేడుక‌ల్ని జ‌రుపుకున్నారు. సంజ‌య్‌ద‌త్ ఫ్యామిలీ దుబాయ్‌లో వుంటోంది. ఇటీవలే దుబాయ్ వెళ్లిన మోహ‌న్‌లాల్ వారి ఇంటికి వెళ్లి సంద‌డి చేశారు.

దీనికి సంబంధించిన ఫొటోల్ని సంజ‌య్‌ద‌త్ వైఫ్ మాన్య‌త సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్ .. నేహా క‌క్క‌ర్ దీపావ‌ళి వేడ‌క‌ల్ని జ‌రుపుకున్నారు. ఆ ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news