చివరి నిమిషంలో బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే?

-

భారతదేశపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను దాదాపు వంద రోజులకు పైగా టీవీలకు కట్టిపడేసే ఈ షో మళ్ళీ అన్ని హంగులతో స్టార్ మా లో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.

మరొక ఐదు రోజుల్లో బిగ్బాస్ సీజన్ ఫోర్ ప్రీమియర్ టెలికాస్ట్ కానుంది. సీజన్-3 లో హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున దీనికి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఇకపోతే ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక విషయంలో ఎన్నో తర్జనభర్జనల అనంతరం బిగ్ బాస్ నిర్వాహకులు 16 మందితో కూడిన ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టుని తయారు చేశారని అందరికీ తెలుసు.

అయితే ఇక్కడ చివరి నిమిషంలో ఒక ట్విస్ట్ వచ్చి పడింది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సుడిగాడు’, ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన మోనాల్ గజ్జర్ ఎవరూ ఊహించని రీతిలో కంటెస్టెంట్స్ లిస్టులో స్థానం సంపాదించింది. తన రెండు చిత్రాల్లో ప్రేక్షకులను తన అభినయంతో, మంచి చలాకీ నటనతో కట్టిపడేసిన మోనాల్ గజ్జర్ ఈ షోకి మరింత ప్లస్ అవుతుందని ‘స్టార్ మా’ నిర్వాహకులు భావించారట.

దీంతో ఈ గుజరాత్ బ్యూటీ సూట్ కేస్ సరిచేసుకొని హైదరాబాద్ కు వచ్చేసింది. చూద్దాం.. ఈమె హౌస్ లో ఎన్ని రోజులు ఉంటుందో…. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news