హ్యాపీ బర్త్ డే కాజల్.. పోస్టర్ రిలీజ్ చేసిన “మోసగాళ్ళు”..!

-

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్ళు. ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్ భాషల లో తెరకెక్కుతుంది. చాలాకాలంగా మంచు విష్ణు నుంచి సినిమా ఏది రాలేదు. అయితే ఈ సారి మాత్రం భారీ హిట్ కొట్టాలన్న కసితో ఒక డిఫ్రెంట్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో జోనరలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక భారీ‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.‌ త్వరలో విదేశాల్లో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టితో పాటు రుహానీ సింగ్‌లు, నవదీప్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇక ప్రస్తుతం కాజల్ మంచు విష్ణు సినిమాతో పాటు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ భారతీయుడు 2 లో నటిస్తుంది. ఈ సినిమా తెలుగు తమిళం హిందీ భాషల్లో రూపొందుతుంది. అలాగే ఒక బాలీవుడ్ సినిమాలోను కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా తనని వెండితెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news