మోస్ట్‌ అవైటెడ్‌ పవన్‌ మూవీ అప్‌డేట్‌ రేపే!

‘పవర్‌‌స్టార్‌‌’ పవన్‌ కల్యాణ్‌–డైరెక్టర్‌‌ హరీష్‌ శంకర్‌‌ కాంబినేషన్‌లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తైన ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను రేపు (గురువారం) ఉదయం అందించనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ప్రకటించింది. గబ్బర్‌‌సింగ్‌ తర్వాత పవన్‌–హరీష్‌ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో మంచి అంచనాలున్నాయి.

pavan new movie

పవన్‌తో హరీష్‌ ఈసారి గబ్బర్‌‌సింగ్‌ను మించే మూవీ తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ మూవీ అనౌన్స్‌ అయినప్పటికీ, ఇప్పటివరకు షూటింగ్‌ స్టార్ట్‌ కాలేదు.
ఈమధ్యే ప్రొడ్యూసర్స్‌తో కలిసి హరీష్‌ శంకర్‌‌ పవన్‌ను కలిశాడు. ఈ సందర్భంగా సినిమా ఎప్పుడు స్టార్ట్‌ చేసేది చర్చించినట్లు సమాచారం. అయితే, రేపు ఇవ్వబోయే అప్‌డేట్‌ సినిమా షూటింగ్‌కు సంబంధించిందా? లేదా హీరోయిన్‌ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిందో తెలియాలంటే గురువారం ఉదయం తొమ్మిదిగంటల నలభై నిమిషాల వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, అయానంకా బోస్‌ కెమెరామెన్‌గా వర్క్‌ చేయనున్నాడు.