ఆఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తరువాత తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో పనిచేసిన వారికి వెదికి పట్టుకుని మరీ కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలోనే వారు అత్యంత దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా తాలిబన్ల నాయకుల ఆధ్వర్యంలో ఆ దేశ కొత్త కేంద్ర కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్‌కు చెందిన విద్యాశాఖ మంత్రి మతి లేని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
తాలిబన్ కొత్త విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వి నూరుల్లా మునీర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీలకు ఈ రోజుల్లో ఎంత మాత్రం విలువ లేదని అన్నారు. తాలిబన్లు ఎలాంటి మాస్టర్, పీహెచ్‌డీ డిగ్రీలు లేకుండానే ఆఫ్గనిస్థాన్ ను కైవసం చేసుకున్నారని, కనుక చదువు అవసరం లేదని అన్నారు.
This is the Minister of Higher Education of the Taliban — says No Phd degree, master's degree is valuable today. You see that the Mullahs & Taliban that are in the power, have no Phd, MA or even a high school degree, but are the greatest of all. pic.twitter.com/gr3UqOCX1b
— Said Sulaiman Ashna (@sashna111) September 7, 2021
అయితే మునీర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతనికి విద్య గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి అయి ఉండి విద్య వేస్ట్ అనడం దారుణమని, ఇది ఆ దేశ యువ, పిల్లలపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు.
కాగా మునీర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది అతన్ని విమర్శిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకోవడం దుర్మార్గమైన చర్య అని, వారి తెలివి ఏమిటో ఇప్పుడే బయట పడిందని అంటున్నారు.