సుక్కూ! మీరు చాలా “సెల్ఫిష్” కదూ! హా తెలుసు!

-

డైరెక్ట‌ర్ సుక్కూ మ‌రో కొత్త కుర్రాడికి జ‌న్మ ఇస్తున్నారు. జ‌న్మ అనే క‌న్నా జీవితం అని చెప్ప‌డం మేలు. జీవితం ఇస్తున్నారు అని రాస్తూ కొన్ని మాట‌లు. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసిన హ‌రి ప్ర‌సాద్ జ‌క్కా ఎప్పుడో డైరెక్ట‌ర్ అయిపోయారు. ఆ మ‌ధ్య టైమ్ ట్రావెలింగ్ స్టోరీతో ప్లే బ్యాక్ పేరిట ఓ సినిమా తీసి అంద‌రినీ ఆలోచింప‌జేశారు కూడా! ఆయ‌న స్క్రిప్ట్ అసోసియేట్ గా సుక్కూ ద‌గ్గ‌ర ప‌నిచేశారు.

ఇక సుక్కూ రైటింగ్ టీంలో మ‌రో మెంబ‌ర్ సూర్య ప్ర‌తాప్ ప‌లనాటి ఆయ‌న కూడా డైరెక్ట‌ర్ అయిపోయి కుమారి 21ఎఫ్ తో హిట్ కొట్టారు. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ మొత్తం సుక్కూనే చేశారు. ఇక ఉప్పెన సినిమాతో మ‌రో శిష్యుడు బుచ్చిబాబు వెలుగులోకి వ‌చ్చారు. ఈ సినిమా నిర్మాణం మొత్తం సుక్కూదే.. ఆ మాట‌కు వ‌స్తే కుమారి 21ఎఫ్ నిర్మాణం కూడా సుక్కూదే! ఇక ఆఖ‌రుగా మ‌రో కొత్త కుర్రాడు రాబోతున్నాడు.

ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. (వెళ్లేముందు ఓ మాట సుక్కూ త‌న నిర్మాణ సార‌థ్యంలో ఇప్పుడు తెర‌కెక్కిస్తున్న సినిమా 18పేజెస్. ఈ సినిమా కు డైరెక్ట‌ర్ సూర్య ప్ర‌తాప్ ప‌ల‌నాటి.. ఈ సినిమా అయిన వెంట‌నే కొత్త సినిమా క‌బురు రావొచ్చు పూర్తి స్థాయిలో)

స్టైలిష్ స్టార్ తో సెల్ఫిష్ డైరెక్ట‌ర్.. కానీ ఈ సారి ఆ స్టైల్ కాస్త మార‌నుంది.. ఎందుకంటే ఇప్ప‌టికింకా సెల్ఫిష్ అనే మూవీకి హీరో స్టైల్ ఏంట‌న్న‌ది ఫిక్స్ కాలేదు క‌నుక ! అవును! మీరు విన్న‌ది నిజ‌మే ! సుక్కూ

(పూర్తిపేరు : సుకుమార్ బండ్రెడ్డి) .. దిల్ రాజు కుమారుడు ఆశిష్ రెడ్డి తో త్వ‌ర‌లో  రూపొందించ‌బోతున్న సినిమా పేరు సెల్ఫిష్.. ఈ సినిమాను సుక్కూ రైటింగ్స్ తో క‌లిసి నిర్మించ‌నున్నారు దిల్ రాజు. డైరెక్ష‌న్ మాత్రం కాశీ అనే కొత్త కుర్రాడికి అప్ప‌గించ‌నున్నారు.

ఈయ‌న కూడా సుక్కూ స్టూడెంటే కావ‌డం విశేషం. సినిమాకు సంబంధించి రైటింగ్ పోర్ష‌న్ మొత్తం సుక్కూనే చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే స్టోరీ లైన్ ఓకే అయింద‌ని, స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని టాక్. సుక్కూ గ‌త చిత్రాల మాదిరిగానే ఈ సినిమా పూర్తిగా కొత్త కొత్త ఆలోచ‌న‌లు రేకెత్తించేలా ఉండ‌నుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news