సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ టాకూర్. ఈ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. సీతగా నటించి అందరి మన్ననలు అందుకుంది. సీతారామం సక్సెస్‌తో మృణాల్‌కు వరుసగా అవకాశాలు కూడా అందుతున్నాయి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ అది చేజారిపోయిందని ఈ ముద్దుగుమ్మ వాపోతూ చెప్పుకొచ్చింది. చివరికి ప్రయత్నించగా ‘లవ్ సోనియా’ సినిమాతో తనకు గుర్తింపు వచ్చిందంది.
ఆ తర్వాత సినీ అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆమె చెప్పింది. సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని అయినా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.