కేసీఆర్ నువ్వు గెలవాలి.. లేకపోతే గంగలో దూకి చచ్చిపోతా.. నల్గొండ రైతు వీడియో వైరల్ !

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. మంచినీటి సమస్యతో మొదలుకొని కరెంటు సమస్యల వరకు అన్ని సమస్యలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయి. హైదరాబాదులో మంచినీటి సమస్య నెలకొంది. ఇటు పంట పొలాలకు నీళ్లు లేక వాటర్ ట్యాంకర్లలో నీటిని సరఫరా చేస్తున్నారు రైతులు. కొంతమంది పంట ఎండిపోతే మంటతో కాల్చేస్తున్నారు.

farmer on kcr

ఈ తరుణంలోనే నల్గొండ జిల్లాకు చెందిన మూచంపల్లి గ్రామ రైతు ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది. నల్గొండ జిల్లా భూషణ్ పల్లి గ్రామ రైతు మల్లయ్య కెసిఆర్ పై ఉన్న అభిమానాన్ని వీడియో ద్వారా తెలిపారు. మరోసారి కెసిఆర్ గెలవాలని… ఆయన గెలవకపోతే గంగలో దూకి చస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలన అద్భుతంగా ఉండేదని.. కాంగ్రెస్ వచ్చా కాస్త కష్టాలు పడుతున్నామని ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. త్వరలోనే మల్లయ్య గారిని, బోర్వెల్ రాంరెడ్డి గారిని తాను కలుస్తానని ప్రకటించారు.

https://x.com/KTRBRS/status/1767410839404110278?s=20

Read more RELATED
Recommended to you

Latest news