మురుగదాస్ తో బన్ని..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో మూవీ కన్ఫాం చేశాడు. ఆ సినిమా తర్వాత బన్ని కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే మురుగదాస్, బన్నిల మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయట. మురుగదాస్ తో బన్ని సినిమా కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. తెలుగులో చిరంజీవి, మహేష్ లతో సినిమా చేసిన మురుగదాస్ ఆ తర్వాత బన్నితో చేస్తున్నాడు.

అసలైతే కోలీవుడ్ డైరక్టర్ లింగుసామితో బన్ని సినిమా కొన్నాళ్లుగా వార్తల్లో ఉండగా ఆ సినిమా ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే బన్నితో లింగుసామి సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్టే. ఫైనల్ గా బన్ని మురుగదాస్ ఫిక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో బన్ని తమిళ మార్కెట్ కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ కు సంబందించిన మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news