స్మార్ట్ బామ్మ…. తెలివి అంటే ఇది..!

-

old woman uses solar panel fan to roast corn

అవును…. ఈ బామ్మ మామూలు బామ్మ కాదు స్మార్ట్ బామ్మ. తన వయసు ముదిరింది కానీ తన ఆలోచనలు కాదు. మీరు పైన ఫోటోలో చూస్తున్న ఈ బామ్మ గురించే మనం మాట్లాడుకునేది. ఏ పని చేసినా దానికి ఓ లెక్క ఉండా లన్నట్టుగా ఈ బామ్మ కూడా తన పని కి టెక్నాలజీ ని జోడించింది.

old woman uses solar panel fan to roast corn

సాధారణంగా కంకులను ఎలా కాలుస్తారో మీకు తెలుసు కదా… కానీ ఈ బామ్మ మాత్రం చాలా స్మార్ట్ గా కాలుస్తుంది.
స్మార్ట్ గా అంటే స్మార్ట్ ఫోన్ తో అనుకునేరు… సోలార్ ప్యానెల్ తో ఉత్పత్తి అయ్యే పవర్ ద్వారా నడిచే ఫ్యాన్ గాలితో కాలుస్తుంది… వావ్ అనిపిస్తుందా… ఎవరికైనా ఇప్పటివరకు ఆ ఆలోచన వచ్చిందా… రూపాయి ఖర్చు లేకుండానే త్వరగా కంకులు కాల్చుతున్న ఈ బామ్మ ను ఏమనాలి. స్మార్ట్ బామ్మ అనే పిలవాలి కదా…. అది సంగతి.

ఇంతకీ ఈ స్మార్ట్ బామ్మ ఎక్కడ ఈ కంకుల బండి ని నడుపుతుంది తెలుసా. బెంగళూరు లో. ఆమె పేరు సెల్వమ్మ… వయసు 75 యేళ్లు. చూసారుగా ఈ వయసులో ఎంత స్మార్ట్ గా సంపాదిస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news