సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మురుగదాస్ ప్రస్తుతం తమిళంలో ఇళయదళపతి విజయ్ హీరోగా సర్కార్ సినిమా చేశారు. నవంబర్ 6న దీపావళి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమాపై కోర్ట్ లో కేసు నడుస్తుంది. తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటూ తమిళ రైటర్ వరుణ్ రాజేంద్రన్ సర్కార్ సినిమాపై కోర్టులో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వివాదంపై మురుగదాస్ చాలా తేలికగా స్పందించారు.
కేవలం ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు తప్ప మరేం లేదని ఇదంతా ఒట్టి డ్రామా అంటూ చెప్పుకొచ్చారు మురుగదాస్. అయినా సినిమా కథ కాపీ అని సినిమా చూశాక చెబుతారు కాని ట్రైలర్ చూసి ఎలా నిర్ణయిస్తారని అన్నారు మురుగదాస్. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా వివాదాన్ని సృష్టిస్తున్నారు తప్ప అసలు ఈ సినిమా కథ కాపీ కాదని అన్నారు. ఇక నిర్మాతలు సినిమా అనుకున్న రోజు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారని దానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని బల్ల గుద్ది మరి చెప్పారు మురుగదాస్.