ఆరెక్స్ జోడి.. సంథింగ్.. సంథింగ్

-

అజయ్ భూపతి డైరక్షన్ లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ చేసిన సినిమా ఆరెక్స్ 100. కాస్త అడల్ట్ డోస్ ఎక్కువైనా కంటెంట్ యూత్ కు కనెక్ట్ అవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నటించిన పెయిర్ కూడా సూపర్ హాట్ గా మారింది. సినిమా రిలీజై మంచి కలక్షన్స్ తెచ్చింది. ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం ఆ ఇద్దరు సినిమా అయ్యాక కూడా కలివిడిగా తిరగడం అనుమానాలకు దారి తీస్తుంది. బోడ్ల్ లవ్ స్టోరీలో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి మరి చేశారు. ఒకవేళ నిజంగానే ఇద్దరు ప్రేమలో పడ్డారా అన్న డౌట్ వస్తుంది. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ అన్నిటికి కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జోడీగా కనిపిస్తున్నారు. మరి ఇలానే కొన్నాళ్లు కనిపించి సడెన్ గా ఏదో ఒకరోజు ఇద్దరు ఉయ్ ఆర్ ఇన్ లవ్ అని షాక్ ఇచ్చేలా ఉన్నారని అనుకుంటున్నారు సిని జనాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version