సర్కార్ యూనిట్ కు మురుగదాస్ వార్నింగ్

-

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయవళపతి విజయ్, క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కార్. నవంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎవరు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వొద్దని మురుగదాస్ ట్వీట్ చేశాడు. తమిళ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న సర్కార్ సినిమా గురించి తన పర్మిషన్ లేకుండా ఎక్కడ ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వొద్దని ట్వీట్ చేశాడు దర్శకుడు మురుగదాస్.

సినిమా స్టోరీ గురించి ఎవరికి తెలియకూడదనే ఉద్దేశంతో మురుగదాస్ ఇలా ట్వీట్ చేశాడని అంటున్నారు. అంతేకాదు తన పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇస్తే చట్టపరమైన శిక్షకు అర్హులవుతారని మెసేజ్ పెట్టాడు. అయితే మురుగదాస్ ఎందుకు అలా ట్వీట్ చేశాడు అన్నది మాత్రం ఎవరికి అర్ధం కావట్లేదు. ప్రస్తుతం మురుగదాస్ ట్వీట్ మీద కోలీవుడ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న సర్కార్ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version