‘ఖుషి’ నుంచి ‘నా రోజా నువ్వే’ రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ సినిమా సెట్‌లోకి అడుగుపెడుతోంది. ఇటీవలే సిటాడెల్ సెట్‌లోకి అడుగుపెట్టిందంటూ ఆ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ అప్డేట్ ఇచ్చాడు.

ఇక బాలీవుడ్‌లో సిటాడెల్‌తో పాటు సామ్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నడుస్తున్న ప్రేమకథాచిత్రం ‘ఖుషి’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ‘నా రోజా నువ్వే’ పాట గ్లింప్స్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. పూర్తి సాంగ్ ను విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 9న రిలీజ్ చేయనున్నారు. ‘ఖుషి’ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా… మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news