చాలామంది ఒకసారి వండుకున్న ఆహార పదార్థాలని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటూ ఉంటారు. మీరు కూడా అలానే చేస్తూ ఉంటారా అయితే కచ్చితంగా దాని వల్ల కలిగే నష్టాలు తెలుసుకోవాలి. ఆహారం విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. అయితే చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే ఒకసారి వంట చేసుకున్న తర్వాత ఆ ఆహార పదార్థాలని మళ్లీ మళ్లీ వేడి చేసుకునే తింటూ ఉంటారు. బంగాళాదుంప కూర మిగిలిపోయిందని ఫ్రిజ్లో పెట్టి దాన్ని మళ్ళీ మీరు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ వేడి చేసుకుని తింటున్నారా.. అయితే ఈ నష్టం మీకు తప్పదు.
బంగాళదుంపని మళ్లీ హిట్ చేయడం వలన ఒక రకమైన బ్యాక్టీరియా అందులో అభివృద్ధి చెందుతుంది దీంతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా బంగాళదుంపల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినకండి. సమస్యలు ఎక్కువవుతాయి. అలానే అన్నం వండిన తర్వాత మిగిలిన అన్నం ని చాలా మంది మళ్ళీ వేడి చేసుకుని తింటుంటారు. అయితే అన్నం మళ్లీ వేడి చేసుకోవడం కూడా మంచిది కాదు. అన్నం ని వేడి చేసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి.
ఫ్రిజ్లో పెట్టిన తర్వాత వెంటనే తీసి వాటిని మళ్లీ వేడి చేసుకుంటే ఫుడ్ పాయిజన్ బ్యాక్టీరియా అందులో ఎక్కువ అవుతుంది పైగా ఆహారాన్ని వేడి చేసుకుని తినడం వలన అందులో ఉండే పోషక పదార్థాలు పోతాయి. దానివల్ల ఆహారం తిన్నా ఉపయోగం ఉండదు. ఆకుకూరలు వంటి వాటిని మళ్లీ వేడి చేసుకుని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికెన్ ని కనుక మిగిలిందని మీరు మళ్ళీ వేడి చేసుకొని తింటే అజీర్తి సమస్యలు కలుగుతాయి.
పుట్టగొడుగులని కూడా వేడి చేసుకుని తీసుకోకూడదు పుట్టగొడుగులని వేడి చేసుకుని మళ్లీ తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు కలుగుతాయి. బాయిల్ చేసిన గుడ్లని కానీ ఫ్రై చేసిన గుడ్లని కానీ మళ్ళీ వేడి చేసుకుని తీసుకోకూడదు ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.