”బ్రో డాడీ” లేదా ”మ‌హాన్” తెలుగు రీమేక్ లో నాగ్, అఖిల్!

-

అక్కినేని నాగ‌ర్జున ఈ మ‌ధ్య కాలంలో చేస్తున్న సినిమాల్లో త‌న కంటే.. త‌న కుమారుల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇప్ప‌టికే మ‌నం, బంగార్రాజు అనే రెండు సినిమాల్లో న‌టించి.. నాగ చైత‌న్య కు హిట్ అందించాడు. తాజా గా అఖిల్ తో సినిమా చేయ‌డానికి నాగ్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగ నాగ చైత‌న్య, నాగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌ల వ‌చ్చిన బంగార్రాజు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగ పెద్ద కుమారునికి హిట్ ఇచ్చిన నాగ్.. చిన్న కుమారుడు అఖిల్ కు కూడా హిట్ సినిమా అందించ‌డానికి రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అందుకోసం అఖిల్, నాగ్ క‌లిసి ఒక సినిమా చేయ‌డానికి నిర్ణ‌యం కూడా తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా కు ప్ర‌ముఖ త‌మిళ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడ‌ని తెలుస్తోంది. నాగ్ వందో సినిమాగా ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. అయితే ఇటీవ‌ల మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్, పృథ్విరాజ్ సుకుమార‌న్ లు క‌లిసి చేసిన బ్రో డాడీ తెలుగు రీమేక్ అని తెలుస్తోంది.

 

కాగ బ్రో డాడీ తెలుగు రైట్స్ ను ద‌గ్గుబాటి సురేశ్ బాబు కొనుగోలు చేశారు. ఈ సినిమాలో రానా, వెంక‌టేశ్ న‌టిస్తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కాగ దీని పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగ బ్రో డాడీ తెలుగు రీమేక్ మిస్ అయితే.. త‌మిళ్ లో విక్ర‌మ్ త‌న కుమారుడు ధ్రువ్ క‌లిసి న‌టించిన మ‌హాన్ సినిమా అయినా.. తెలుగులో రీమేక్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news