రైల్వే ప్రయాణికులు అదిరిపోయే శుభవార్త. ఇండియాలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కేసులు తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో.. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో అన్ రిజర్వ్‌డ్ సీట్లను పునరుద్దరిస్తున్నట్లు తాజాగా రైల్వే శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. జనరల్ క్లాసులో ప్రయాణికులు కరోనాకు ముందులా అప్పటి కప్పుడు టికెట్లు కొనుగోలు చేసి.. ప్రయాణం చేయవచ్చును.
కరోనా సమయంలో.. రద్దీని నియంత్రించడానికి ఈ జనరల్ క్లాస్ టికెట్లనూ.. . రిజర్వేషన్ కేటగిరీగా మార్చి అందులో ఉన్న సీట్ల సంఖ్య వరకు మాత్రమే రైల్వే శాఖ విక్రయించేది. అందుకోసం రిజర్వేషన్ ఛార్జీ కింద రూ. 20 అదనంగా వసూలు చేసేది. ఇప్పుడు వాటిని కరోనా మహమ్మారి ముందు నాటి మాదిరి మార్చినందున జనరల్ క్లాసు టికెట్ తీసుకునే వారు ఇక పై రూ. 20 అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదన్న మాట. జనరల్ క్లాస్ టికెట్లను రిజర్వ్‌డ్ కేటగిరీ నుంచి తొలగించడంతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఊరట లభిస్తుంది.