మీరు చేస్తే రైటు మేము చేస్తే తప్పా.. నాగబాబు కామెంట్ 1 స్టేటూన్..!

-

మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలకు విమర్శలు వస్తున్న ఈ నేపథ్యంలో అసలు తానెందుకు అంతగా మాట్లాడాల్సి వచ్చిందో వివరిస్తూ ఓ వీడియో పెట్టారు. నాగబాబు ఫస్ట్ కామెంట్ వీడియో సారాంశం ఏంటంటే పవన్ ఎవరో తనకు తెలియదని చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తిని నేను టార్గెట్ చేస్తున్నానని అనుకున్నారు.

ముందు నేను ఆ వ్యక్తి గురించి చాలా సరదాగా కామెంట్ చేశా లేదు అతన్ని నేను కావాలనే టార్గెట్ చేశానని భావిస్తే అది మీ ఇష్టం. లాస్ట్ ఎలక్షన్స్ లో మీ బావ వచ్చి పవన్ సపోర్ట్ తీసుకుని గెలవాల్సిన జగన్ ను ఓడిపోయేలా చేసుకుని ఇప్పుడు పవన్ ఎవరో తెలియదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అంటే మీరంటే రైటు మేమంటే కాదా.. దిస్ ఈజ్ నాట్ రైట్ అంటూ మళ్లీ బాలకృష్ణని టార్గెట్ చేస్తూ నాగబాబు వ్యాఖ్యలు చేశాడు.

తాను చేసిన కామెంట్స్ వివాదాస్పందంగా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ఎలాంటి కాంట్రవసీలకు, వివాదాలకు తాను వెళ్లనని ఇలాంటివి చేసి ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న పేరు చాలు.. అంటూ వీడియో మొదలు పెట్టి తను చెప్పాలనుకున్న విషయం చెప్పారు నాగబాబు. అంతేకాదు సెకండ్ కామెంట్ ఈరోజు రాత్రి 9 గంటలకు పెడుతున్నట్టుగా వీడియో చివర్లో పెట్టారు.

https://youtu.be/RkHtjIE4Gmo

Read more RELATED
Recommended to you

Exit mobile version