మజిలీ ప్రియతమా సాంగ్.. ప్రేమపరవశంలో చైతు, సమంత..!

-

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి మొదటి సాంగ్ ప్రియతమా.. ప్రియతమా.. రిలీజ్ చేశారు. మెలోడీ సాంగ్ గా వచ్చిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా చిన్మయి శ్రీపాద పాడటం జరిగింది.

ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న మజిలీ సినిమా ఫీల్ గుడ్ మూవీగా వస్తుంది. చైతు, సమంతలతో పాటుగా ఈ సినిమా మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ నటిస్తుంది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంతలు కలిసి నటించడమే కాదు రీల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా నటించడం విశేషం. పెళ్లి తర్వాత వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న సమంత మజిలీతో మెమరబుల్ హిట్ అందుకునేలా ఉంది. నిన్ను కోరితో ప్రతిభ చాటుకున్న శివ నిర్వాణ మజిలీతో వస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news