Dhootha : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ రిలీజ్

-

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పా్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్య తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ దూత. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించింది. గత సంవత్సరమే విడుదల కావాల్సిన ఈ సిరీస్ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడగా మళ్లీ ఇన్నాళ్లకు మోక్షం లభించింది. ఇప్పటికే సిరీస్ కు సంబంధించి లుక్స్ విడుదల చేయగా అభిమానుల అటెన్షన్ ను గ్రాబ్ చేశాయి.

ఈ క్రమంలోనే మేకర్స్ నాగచైతన్యతో ప్రమోషన్స్ ప్రారంభించడమే కాక…. సిరీస్, ట్రైలర్ విడుదల తేదీలను ప్రకటించి గురువారం నాగచైతన్య జన్మదినం సందర్భంగా టైలర్ ను విడుదల చేశారు. “లెక్కపెట్టలేనని వాస్తవాలు, చెప్పలేని రహస్యాలు వాటిని కనుగొనేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటం ఇది” అంటూ సిరీస్ గురించి క్లుప్తంగా వివరించారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకుంది. ఇది చూసిన వారికి సిరీస్ తప్పక చూడాల్సిందే అన్నట్టుగా ఈ ట్రైలర్ ను తీర్చిదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news