తెలంగాణ రాష్ట్ర అసెం బ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం ఉండటం తో..తెలంగాణ ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఓటర్ స్లిప్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘం చీఫ్ వికాస్ ఆదేశాలు జారీ చే శారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ఓటర్లందరికీ.. స్లిప్పులు అందజేయాలని స్పష్టం చేశారు.
ఇక అటు ఈవీఎంల తనిఖీ గురించి అన్ని రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల పరిశీలకులూ ఆ సమయంలో అందుబాటులో ఉంటారని పేర్కొంది. ఈవీఎంలలో అందరూ సంతృప్తి వ్యక్తం చేసిన వాటికి సీలు వేసి పోలింగ్ ప్రక్రియలో వినియోగించాలని తెలిపింది.
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. ఇందుకోసం ఈసీ రాష్ట్రానికి 72,931 బ్యాలెట్ యూనిట్లు, 57,592 కంట్రోల్ యూనిట్లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే.