టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది.

సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 208 రోజుల్లో 84 నియోజకవర్గాల్లో 2,852.4 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేశారు.
కాగా కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నాడు జగన్ పై నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల జీవితాలు మార్చేస్తానన్న జగన్ ఇప్పుడు వాళ్ల పాలిట యముడి లా తయారు అయ్యాడని ఆగ్రహించారు.