నాగ చైతన్య తో పూజా హెగ్డే కి “థ్యాంక్యూ” చెప్పమంటున్న విక్రం కుమార్ …!

45

క్రియోటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ 2014 లో అక్కినేని ఫ్యామిలీ తో తెరకెక్కించిన ‘మనం’ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్కినేని నాగేశ్వర రావు ఆఖరి సినిమా కూడా మనం కావడం విశేషం. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ విక్రమ్ కుమార్ అక్కినేని హీరోల తో సినిమా చేయలేదు. మనం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలన్ని వరుసగా ఫ్లావతూ వస్తున్నాయి. సూర్య తో తీసిన 24, అఖిల్ తో తీసిన హలో, నాని తో తీసిన గ్యాంగ్ లీడర్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. అయినా ఈ సారి చైతూ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నాడు.

 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ అక్కినేని నాగ చైతన్య కోసం ఓ కథని సిద్ధం చేశాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ను హీరో నాగ చైతన్యకు వినిపించగా కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికి సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలకి కొన్ని మార్పులు సూచించాడట నాగ చైతన్య. ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కుమార్ నాగ చైతన్య సూచించిన మార్పులను చేస్తున్నాడట.

ఇక ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ కి జంటగా సాయి పల్లవి నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన పోస్టర్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక విక్రమ్ కుమార్ చైతూ తో తెరకెక్కించబోయో సినిమాకి ‘థాంక్యూ’ అన్న టైటిల్ ని అనుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటించబోతుందని సమాచారం. పూజా హెగ్డే ప్రస్తుతం అటు బాలీవుడ్ లో రెండు సినిమాలు ఇటు టాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా గనక కమిటయితే చైతూ తో రెండవసారి జోడీ కట్టినట్టు అవుతుంది.