నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా నాగ్ కెరియర్ లో 50 కోట్ల మార్క్ అందుకుని సంచలన విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత నాగార్జున మళ్లీ అలాంటి హిట్ కొట్టలేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడు తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఈ రెండు సినిమాల తర్వాత నేల టిక్కెట్టు తీసిన కళ్యాణ్ కృష్ణ సినిమా ఫ్లాప్ అందుకున్నాడు. రవితేజ హీరోగా వచ్చిన నేల టిక్కెట్టు నిరాశ పరచింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలోని బంగార్రాజు పాత్రతో ఓ కథ సిద్ధం చేశాడు కళ్యాణ్ కృష్ణ. అయితే ఆ కథలో కొన్ని మార్పులు సూచించగా నాగార్జున అంచనాలకు అందుకోలేదని ఆ ప్రాజెక్ట్ ఆపేశాడు.
ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టు ఫలితం చూసి ఇక నాగార్జున బంగార్రాజు మీద ఆశలు వదిలేస్తాడని అనుకున్నారు. కాని ఎలా ఒప్పించాడో ఏమో కాని బగార్రాజు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని స్వయంగా నాగార్జున చెప్పాడు. సో మళ్లీ బంగార్రాజు సందడి సిని ప్రియిలు చూసే అవకాశం ఉంది.