నాగార్జున సరసన కేడి , కింగ్, చింతకాయల రవి వంటి సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో క్యాన్సర్ తో పోరాడి తిరిగి వచ్చిన మమత మోహన్ దాస్ ఆ తర్వాత లింఫోమా అనే వ్యాధితో కూడా బాధపడింది . క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినా.. బాధపడకుండా.. కష్టపడి ఓర్చుకొని.. ట్రీట్మెంట్ తీసుకొని ఆ వ్యాధుల నుంచి పోరాడి జయించి బయటపడింది.క్యాన్సర్ తో పోరాడి వచ్చిన తర్వాత కూడా మళ్లీ సినిమాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.
\
ఆ తర్వాత మలయాళం సినిమాలతో బిజీ అయిన ఈమె అప్పుడప్పుడు తెలుగులో స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తోంది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు మలయాళం సినిమాలతో బిజీగా ఉన్న మమతా మోహన్ దాస్ తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోని షేర్ చేసి తన శరీరం రంగును కోల్పోవడానికి కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తో తాను బాధపడుతున్నట్టు స్పష్టం చేసింది. అలాగే రోజూ దీనికోసం సూర్యకిరణాలు చాలా అవసరం అని , అందుకే ఉదయాన్నే లేవగానే సూర్యుడు ముందు కూర్చుంటాను అని.. నా డిసీజ్ తగ్గాలి అంటే సూర్యుడికిరణాలు నన్ను తాకాలి అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అయితే క్యాన్సర్ తో పోరాడి వచ్చిన మమతా మోహన్ దాస్ ఇప్పుడు మళ్లీ ఇంకో వ్యాధితో పోరాడుతుండడంతో త్వరగా కోలుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని నేటిజన్ లు, అభిమానులు, సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఇది అంత పెద్ద వ్యాధి కాదని.. ఒక స్కిన్ ఎలర్జీ లాంటిదని.. కాబట్టి చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి అయితే మమత మోహన్ దాస్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram