హిమాలయాల్లో వేట సాగిస్తున్న వైల్డ్ డాగ్..

కరోనా కారణంగా నిలిచిపోయిన నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రీకరణ ఈ మధ్యనే మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ మొదలు పెట్టిన నాగార్జున, వైల్డ్ డాగ్ కోసం హిమాలయాలకి వెళ్ళాడు. అటు బిగ్ బాస్ రియాలిటీ షో కి కొన్ని వారాల పాటు సెలవు పెట్టి మరీ షూటింగులో పాల్గొంటున్నాడు. సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ నుండి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

నాగార్జున, సయామీ ఖేర్, ఆలీ రెజా మొదలగు వారందరూ చేతిలో తుపాకులు పట్టుకుని అడవుల్లో ఉగ్రవాదులని వెతుకుతు‌న్నట్టుగా ఉన్నారు. వైల్డ్ డాగ్ అనే పేరుకి సరైన రీతిలో వారి వేషాధారణ ఉంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దియా మీర్జా హీరోయిన్ గా కనిపిస్తుంది.