రాములమ్మ దుబ్బాక ప్రచారానికి వెళ్లంది ఇందుకేనట…!

-

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నవిజయశాంతి… దుబ్బాక ఎన్నికల ప్రచారం కి ఎందుకు వెళ్ళలేదు..? పార్టీ మారాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారా రాములమ్మ మనసులో ఇంతకి ఏముంది అంటే ఆసక్తికర విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. పార్టీ మీద అలక ఒక ఎత్తయితే… గతంలో మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతి కి జిల్లా అంతటా కొంత క్యాడర్ అయితే ఉంది.

అలాంటి రాములమ్మ కరోనా ని సాకుగా చూపి ప్రచారం కి వెళ్లడం లేదంటే నమ్మలేం. పార్టీ నాయకత్వం తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ….అక్టివిటి లేకుండా చేస్తున్నారన్న ఆవేదన…దీనికి తోడు కేవలం ఎన్నికల సమయంలోనే పార్టీ ప్రచారానికి పిలవడం కూడా రాములమ్మకు చిర్రెతిందట. ఓట్లు వేయించాడని అక్కరకు వస్తా కానీ…పార్టీ కార్యాచరణ చేయడానికి పనికి రానా…? అని కొంత కోపంగానే ఉంది.

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో… భేటీ రెండు మూడు రోజుల క్రితం జరిగిన డవలప్మెంట్. కానీ దుబ్బాక ఎన్నికల ప్రచారం మొదలైంది మాత్రం నెల రోజులు కావస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం కి మొదట వెళ్లాలని అనుకున్నా… trs లో ఉన్నప్పుడు రామలింగారెడ్డి తో కలిసి పని చేసిన ఉద్యమాల తో పాటు… ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవి విజయశాంతి ఫామిలీ కి. దీనికి తోడు రామలింగారెడ్డి చనిపోయాక ఆ కుటుంబాన్ని ఓదార్చరు కూడా.

ఇవన్నీ ఒక ఎత్తయితే… ప్రస్తుతం దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తండ్రి చెరుకు ముత్యం రెడ్డి… ఉద్యమ సమయంలో దుబ్బాక లో విజయశాంతి అనుచరులపై ముత్యం రెడ్డి కేసులు పెట్టించారట. ఇదే కాదు విజయశాంతి ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే తరహా వ్యాఖ్యలు కూడా చేశారట. ఇలాంటి సందర్భంలో రామలింగారెడ్డి అండగా ఉన్నారట. అలాంటిది ఇప్పుడు ఎన్నికల ప్రచారం కి వెళ్లి…ముత్యం రెడ్డి కుమారుడికి ఓటు వేయాలని ఎలా చెప్తం..? ముత్యం రెడ్డి తో ఇబ్బంది పడ్డ కార్యకర్తలను…ఉప ఎన్నికల్లో ముత్యం రెడ్డి కుమారుడికి ఓటు వేయండి అని ఎలా చెప్పాలి అనేది విజయశాంతి మనసులో మాట. అప్పట్లో అండగా ఉన్న రామలింగారెడ్డి కుటుంబాన్ని కాదని… ఇబ్బందులు పెట్టిన కుటుంబం కోసం ప్రచారం ఎందుకు చేయాలి అన్నది విజయశాంతి లాజిక్ అట.

ఏదైనా… రాములమ్మ మాత్రం రాజకీయంగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని మాత్రం డిసైడ్ అయ్యారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాతో… ఫలితాలకు ముందో తన రాజకీయ భవిష్యత్ ఎక్కడ అనే క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్.

Read more RELATED
Recommended to you

Latest news