నాగార్జున కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్‌..!

-

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేందుకు రెడీ అవుతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాగా ఇదిలా ఉంటే నాగార్జున తమిళ దర్శకుడు అనిల్‌తో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. జ్ఞానవేళ్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం ఈ మూవీకి Love Action Romance టైటిల్‌ పెట్టారట. ఈ క్రేజీ చిత్రంలో నాగ్‌ పక్కా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. స్టూడియో గ్రీన్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట. మొత్తానికి కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సర్‌ప్రైజ్‌ గెటప్స్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడని తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news