ఉపాసన కామినేని ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ టైమ్‌ను హాయిగా జాలీగా ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్. తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పటి నుంచి ఉపాసన సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కాస్త పెరిగింది. మెగా వారసుడి గురించి ఎప్పుడెప్పుడు తీపి కబురు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఉపాసన తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలో ఓ లవ్లీ పోస్టు షేర్ చేసింది. తన మూడో నెల రోజులను గుర్తుచేసుకుంటూ.. అప్పుడు తీయించుకున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.
‘ఆశ్చర్యంగా ఉంది.. నా గ్యాలరీలో ఉన్న ఇంత మంచి ఫొటోలను నేను ఇప్పటి వరకు షేర్ చేయలేదా..!’ అని క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ ఫొటోలకు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ‘ఎంతో అందంగా ఉన్నావు’ అని మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కామెంట్ పెట్టగా హార్ట్ సింబల్స్‌తో ఉపాసన రిప్లై ఇచ్చింది.
#Throwback to my first trimester ❤️@ManishMalhotra @Anaita_Adajania pic.twitter.com/HoFU2W6Oim
— Upasana Konidela (@upasanakonidela) May 28, 2023