జగన్‌, మహేష్‌బాబు.. ఇంట్రెస్టింగ్‌గా నమ్రతా ఇన్‌స్టా స్టోరీ

-

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల మరియు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. అయితే సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

Namrata's interesting insta story
Namrata’s interesting insta story

సినిమా రిలీజ్ కాగానే… పాజిటివ్ టాక్ కూడా వస్తుంది. అయితే పెద్దగా కలెక్షన్లు మాత్రం ఈ సినిమాకు రావడం కష్టమేనని కొంతమంది చెబుతున్నారు. అటు ఈ సినిమా చూసేందుకు కుటుంబ సమేతంగా థియేటర్కు కూడా వెళ్లారు మహేష్ బాబు.

అయితే ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మరియు మహేష్ బాబు ఇద్దరూ ఉన్న వీడియోను ఎడిట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేష్ బాబు సతీమణి నమ్రత. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. 18 సెకండ్ల పాటు ఈ వీడియో ఉంది. అయితే ఏపీ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీకి ఓటు వేయాలని ఇన్ డైరెక్ట్ గా నమ్రత పోస్ట్ పెట్టిందని కొంతమంది ఫైర్ అవుతున్నారు.

https://x.com/TeluguScribe/status/1745804643815268553?s=20

Read more RELATED
Recommended to you

Latest news