‘భగవంత్ కేసరి’ సెట్స్​లో మోక్షజ్ఞ.. ఫొటోలు వైరల్

-

నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తరచూ నెట్టింట ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటోంది. ఇక తాజాగా నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లిలో మోక్షజ్ఞ కనిపించడంతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. మళ్లీ నెట్టింట నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి రచ్చ మొదలుపెట్టారు.

అయితే తాజాగా మాత్రం సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఫొటో ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. తాజాగా మోక్షజ్ఞ.. బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సెట్స్​ను సందర్శించాడు. దర్శకుడు అనిల్​రావిపూడి, శ్రీలీల, కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​తో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. ఈ ఫొటోల్లో మోక్షజ్ఞ కాస్త స్లిమ్​గా ఫిట్​గా కనిపించాడు. ప్రస్తుతం సోషల్ ​మీడియాలో ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. పులి బయటకొచ్చింది, సింహం యాటకొచ్చే సమయం వచ్చినట్టుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news