ఉపాధి హామీ కూలీలకు బిగ్ అలర్ట్… సెప్టెంబర్ ఒకటో తేదీ జాబ్ కార్డులు

-

ఉపాధి హామీ కూలీలకు బిగ్ అలర్ట్…దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఆధార్ తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు, చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబర్ తో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి.

ఈ మూడింటిని అనుసంధానం చేసుకొని వారికి సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైన వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేదుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని తోలుత భావించిన చాలా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కూలీల జాబు కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news