జూనియర్ ఎన్టీఆర్ పై అలాంటి కామెంట్స్ చేసిన నందమూరి రామకృష్ణ..!

-

జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకొని స్టార్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పేరును మరింత పదిలం చేసుకోవడానికి సినిమా కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇకపోతే ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటుండగా.. ఎన్టీఆర్ మాత్రం వరుస పెట్టి స్టార్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. అంతేకాదు ఆయనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కానీ.. కోరిక కానీ.. ఏమాత్రం లేవన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే రాజకీయాల్లోకి వచ్చి టిడిపి పార్టీ పగ్గాలు పట్టుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో టిడిపి తరఫున ఎన్టీఆర్ పార్టీ లోకి రావాలని అటు పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నాయి. ఇకపోతే పరిస్థితి ఇలా ఉంటే గత కొంతకాలంగా టిడిపి పార్టీకి గాని అటు రాజకీయాలకు సంబంధించి తనపై వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించడం లేదు. అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే నందమూరి రామకృష్ణ.. ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. జగన్ వైసిపి ప్రభుత్వం ఓడిపోతుందని నందమూరి రామకృష్ణ కామెంట్లు చేశారు. అంతేకాదు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడని కూడా తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. అయితే వచ్చే ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తారా? లేదా అన్న విషయంపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. కాబట్టి ప్రచారం చేసే అవకాశం ఉంది..కానీ పోటీ చేసే అవకాశం లేకపోవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్నాడని కూడా తెలిపారు రామకృష్ణ. మొత్తానికి అయితే ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news