నాని “దసరా” టీజర్ రిలీజ్

-

గతేడాది శ్యాం సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన న్యాచురల్ స్టార్ నాని.. ఈ ఏడాది దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంసీఏ తర్వాత నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రెండవ సినిమా ఇది.

మొదటిసారిగా నాని ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 90 కాలంనాటి బ్యాగ్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో నాని రా అండ్ రెస్టిక్ లుక్ లో కనిపించబోతున్నాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస అప్డేట్లతో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ అండ్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

ఈ సినిమా ట్రైలర్ ని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో స్టార్ హీరోలు రిలీజ్ చేశారు. తమిళ టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చేయగా, మలయాళం టీజర్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. ఇక కన్నడ టీజర్ ను రక్షిత్ శెట్టి రిలీజ్ చేయగా, హిందీ టీజర్ ను షాహిద్ కపూర్ విడుదల చేశారు. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ అధ్యంతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఊర మాస్ లుక్ లో నాని అదరగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news