‘దసరా’పై నాని ఫుల్ ఫోకస్..

-

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. జనాలను ఎంటర్ టైన్ చేయడంలో ఎప్పుడు ముందుండే నాని ఈ సినిమా ద్వారా కూడా ఎంటర్ టైన్ చేశాడు. అయితే, అనుకున్న స్థాయిలో ఈ ఫిల్మ్ ఆడలేకపోయిందనేది సినీ పరిశీలకుల వాదన.

 

ఈ సంగతులు పక్కనబెడితే..నాని తన నెక్స్ట్ ఫిల్మ్ ‘దసరా’పైన ఫుల్ ఫోకస్ పెట్టేశాడని తెలుస్తోంది. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తు్న్నాడు.

‘మహానటి’ కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ ఇరవై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news