ఇది చారిత్రాత్మక నిర్ణయం : జీవీఎల్‌

-

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని ఆయన అన్నారు. తొలిసారిగా ఆదివాసీ మహిళకు ఈ అవకాశం దక్కడం గొప్ప విషయమని, దేశమంతా పండుగ వాతావరణ నెలకొందన్నారు.

TDP threatened me publicly': BJP MP GVL Narasimha Rao moves privilege  notice in RS | The News Minute

ఇతర పార్టీలకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సైతం ద్రౌపది ముర్ము కు మద్దతు పలికే పరిస్థితి నెలకొందని, ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తో మాట్లాడి మద్దతు అడిగారన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ద్రౌపది ముర్ము ప్రచారం మొదలు పెడతారని, ఇతర పార్టీలు సైతం పునరాలోచనలో పడ్డారన్నారు. ఉన్నతమయిన ఆలోచనతో ఈ నిర్ణయం బిజెపి తీసుకుందని, కొందరు తప్పుడు వాఖ్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్రపతి కానున్న మహిళపై కామెంట్స్ చేయటం సరి కాదని, ట్విట్టర్లో వాఖ్యలు చేసిన వర్మ ట్విట్ తొలగించాలని ఆయన
డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news