ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులను
ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే రెండు నెలల కోర్సుకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక బ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫీజును డీడీ ద్వారా గానీ, ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా గానీ స్వీకరిస్తామన్నారు. ఇతర వివరాలకు 7013573180, 7989903001, 8331040963 నెంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.